హైదరాబాద్ లో దారుణం..పుస్తకాల ఆశ చూపి బాలికపై అత్యాచారయత్నం..

0
95

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. 8వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలికపై పక్కింట్లో ఉండే జయంత్ చారి అత్యాచారానికి పాల్పడలనుకున్నాడు. దీనికోసం పక్క ప్లాన్ వేసుకున్నాడు.  ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పుస్తకాలు ఇస్తానని తన ఇంటికి పిలిచాడు.

ఇంట్లోకి రాగానే బాలికపై అత్యాచారయత్నం చేశాడు. అతడి చేష్టలకు భయపడ్డ బాలిక గట్టిగా అరుస్తూ బయటకు పరుగు తీసి జరిగిన సంగతి తల్లిదండ్రులకు చెప్పింది. ప్రస్తుతం పోలీసులు తల్లిదండ్రుల  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.