ఫ్లాష్: ఏసీబీకి చిక్కిన ఏఈ సాంబశివరావ్

0
127

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా మారుతున్నారు. ఇప్పటికే లంచాలు తీసుకుంటూ పట్టుబడిన అధికారులు చాలా మందే ఉండగా..నిన్నటికి నిన్న తెలంగాణలోని నల్గొండలో హాలియా ఎక్సైజ్ సీఐ యమునాధర్ రావుని రెడ్ హ్యాండెడ్ గా ఎసిబి అధికారులు పట్టుకున్నారు.

ఈ ఘటన మరవకముందే..ఏపీలోని రాంబద్రపురం గ్రామానికి చెందిన ఏఈ సాంబశివరావ్ 50 వేల రూపాయలు లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రైతుకి సంబంధించిన బోర్ కనెక్షన్ సాంక్షన్ చేయడానికి కోసం 50 వేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.