కట్టుకున్న వాడి మీద కోపంతో కన్నబిడ్డలను బలి తీసుకుంది ఓ తల్లి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా ఒకేసారి ఐదుగురు పిల్లలకు మత్తుమందిచ్చి దారుణంగా హత మార్చింది. అమ్మ ప్రేమకు తలవొంపులు తెచ్చేలా కన్న బిడ్డల్ని కర్కశంగా హతమార్చిన ఆ తల్లికి న్యాయస్థానం జీవితఖైదు విధించింది.
అదేవిధంగా 15 ఏళ్ల పాటు పెరోల్‌కు అనర్హురాలిగా తీర్పు వెలువరించింది. జర్మనీలోని బెర్లిన్ నగరంలోని సోలింగెన్ ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల క్రిస్టియానే గతేడాది సెప్టెంబర్‌లో తన ఆరుగురు బిడ్డల్లో ఐదుగురిని హత్య చేసింది. మృతుల్లో ఒక సంవత్సరం, రెండు, మూడే ఏళ్ల వయసున్న ముగ్గురు కుమార్తెలు ఉండగా.. ఆరు, ఎనిమిదేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు.