ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు వాతావరణశాఖ అలర్ట్..

0
37

తెలంగాణలో భారీ వ‌ర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. బంగాళాఖాతంలో శ్రీలంక ద‌గ్గ‌ర్లోని కొమరీన్ ఏరియాలో అల్పపీడనం ఏర్పడింది. దీని ఎఫెక్ట్ తో ఏపీ తీరం వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం కొద్దిగా బలహీనపడింది. దీంతో దాదాపు మూడు రోజులు తెలంగాణ‌లో వ‌ర్షాలు దంచికొట్టే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేసింది. ఇప్ప‌టికే వాతావ‌రణంలో కాస్త తేడా క‌నిపిస్తోంది.

ఏపీలో ఆదివారం వరకు ఓ మూడు రోజులపాటు వర్షాలు కురువయనున్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ అరేబియా వైపు వస్తోంది. మరో 24 గంటల్లో అల్పపీడనం బలపడే అవకాశాలు ఉన్నాయ‌ని.. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, జిల్లాలతో పాటు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్న‌ట్లు వెల్ల‌డించింది.