సుదర్శన్ పట్నాయక్ అద్భుత సైకత శిల్పం

Sudarshan Patnaik is a marvelous sculpture

0
34

ఆయన ఒక అద్భుత శిల్పి. శిలలను శిల్పాలుగా మార్చి గణతికెక్కిన ఎందరో శిల్పుల కన్నా భిన్నంగా ఈయన సముద్రపు ఒడ్డును, ఇసుకను తన కళాత్మక ప్రతిభతో శిల్పాలుగా మార్చి..సందర్శకుల ప్రశంసలతో పాటు భారత రాష్టప్రతి పురస్కారాన్ని కూడా అందుకున్న ప్రముఖ సైకత శిల్పి.

ప్రపంచ స్థాయి సైకత శిల్పాల ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత్‌ తరుపున ప్రాతినిధ్యం వహించిన ఘనత ఆయనకే దక్కింది. ఒక ప్రక్క దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టడంతో పాటు..సైకత శిల్పాల నిర్మాణంలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్న ఓ సృజనాత్మ కళాకారుడు. ఆయన ఎవరో కాదు సుదర్శన్ పట్నాయక్ జీ

అయితే తాజాగా ఒడిశాలోని పూరి బీచ్‌లో 2,256 ప్రమిదలతో కాళీ అమ్మ వారి సైకత శిల్పాన్ని తయారు
చేసి ఒరా అనిపించాడు సుదర్శన్. ఈ సైకత శిల్పం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.

పట్నాయక్‌ ఇప్పటి వరకూ భారత్‌ తరుపున అంతర్జాతీయస్థాయి పోటీల్లో 40 సార్లు పాల్గొన్నారు. పదిహేను ప్రథమ బహుమతులను గెలుచుకున్నారు. ’’ఆగస్టు 1న నిర్వహించిన ఎనిమిదవ అంతర్జాతీయ బెర్లింగ్‌ శాండ్‌ స్కల్‌ప్చర్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో ‘ఫిఫ్త్‌కాన్సిక్యూటివ్‌ విన్నర్‌’ అవార్డును గెలుచుకున్నాను.ఇది ప్రపంచ రికార్డు అని నిర్వాహకులు అభివర్ణించారు. ఆ తరువాత రాష్టప్రతి ప్రతిభా పాటిల్‌ చేతులమీదగా పురస్కార లేఖను అందించారు.’ అని పట్నాయక్‌ తెలిపారు.