Breaking: చిన్నారి ఆత్మహత్య..పార్టీ నుంచి వినోద్ కుమార్ సస్పెండ్

Another big shock to Vinod Kumar, suspended from the party

0
43

విజయవాడకు చెందిన చిన్నారి ఆత్మహత్యకు కారణమైన వినోద్ కుమార్ కు మరో బిగ్ షాక్‌ తగిలింది. చిన్నారిని లైంగికంగా వేధించిన వినోద్ కుమార్ జైన్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీడీపీ పార్టీ. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా విజయవాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం మాట్లాడుతూ..వినోద్ కుమార్ జైన్ అనైతిక చర్యలకు పాల్పడ్డాడని మండిపడ్డాడు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వినోద్ కుమార్ జైన్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు.

అనైతిక చర్యలకు పాల్పడినా..పార్టీ విధి విధానాలు ఉల్లంఘించినా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి సంఘటన ల్లో ఎలాంటి వారిని నైనా వదిలి పెట్టేదే లేదని స్పష్టం చేశారు. కాగా.. విజయ్‌ కుమార్‌ లైంగిక వేధింపులు తట్టుకోలేక..బాలిక ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.