Flash- కుప్పకూలిన మరో విమానం..తొమ్మిది మంది దుర్మరణం

Another plane crashes, killing nine

0
79

బుధవారం డొమినికన్ రిపబ్లిక్‌లో ప్రైవేట్ విమానం కుప్పకూలింది. డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగోలోని లాస్ అమెరికాస్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం అత్యవసరంగా ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలను కోల్పోయారు. మరణించిన వారిలో ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఏడుగురు ప్రయాణికుల్లో ఆరుగురు విదేశీయులు కాగా, ఒకరు డొమినికన్ అని విమానం ఆపరేటర్ హెలిడోసా ఏవియేషన్ గ్రూప్ ట్వీట్ చేసింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.