కరోనా అప్డేట్: మరో 343 మంది ప్రాణాలు తీసిన వైరస్

Corona update: Another virus that killed 343 people

0
42
Covid-19 background. Stop spread and eliminate Coronavirus. Pandemics coronavirus. Epidemic backround. Healthcare background. Hands in blue medical gloves tearing the paper with covid-19 print

భారత్ లో కొత్తగా 7,974 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 343 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 7,948 మంది కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవమే చేస్తోంది.

కొత్తగా 7,07,768 కేసులు నమోదయ్యాయి. అన్ని దేశాల్లో సుమారుగా 7,822 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం జోరుగానే సాగుతోంది. బుధవారం 60,12,425 మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,35,25,36,986కు చేరింది.

మొత్తం కేసులు: 3,47,18,602

మొత్తం మరణాలు: 4,76,478

యాక్టివ్ కేసులు: 87,245

కోలుకున్నవారు: 3,41,54,879