Flash: ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో మరో ట్విస్ట్

0
39

హైదరాబాద్ నగర శివారులో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడ గ్రామ సమీపంలో స్కార్పియో వాహనంపై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి రాఘవేందర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది.

తమ భూమిని కబ్జా చేస్తున్నారని రాచకొండ పోలీసులను లేక్ విల్లా ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, రాఘవ రెడ్డిలపై గతంలో పలుమార్లు ఫిర్యాదులు చేశారు. కానీ  ఫిర్యాదులను స్థానిక పోలీసులు పట్టించుకోలేదు. గత వారం రోజుల క్రితం కూడా ప్లాట్ ఓనర్స్ ను శ్రీనివాస్ రెడ్డి బెదిరించాడు. తమకు న్యాయం జరగకపోవడంతో కోర్టు మెట్లెక్కెందుకు లేక్ విల్లా ఓనర్స్ సిద్ధం అవుతున్నారు. ఈ తరుణంలో అగంతకుల కాల్పుల్లో శ్రీనివాస్ రెడ్డి, రాఘవ రెడ్డి మరణించారు.

1996లో నెల్లూర్ వాసులకు ఇంద్ర రెడ్డి, నర్సింహ రెడ్డి, దేవి, పురుషోత్తం రెడ్డి భూమి అమ్మారు. నెల్లూరు వాసుల నుండి భూమిని లేక్ విల్లా ప్లాట్ ఓనర్స్ సభ్యులు సెల్ డీడ్ చేసుకున్నారు. వ్యవసాయేతర భూమిని వ్యవసాయ భూమిగా చూపించి ఇంద్ర రెడ్డి వద్ద నుండి శ్రీనివాస్ రెడ్డి, రాఘవ రెడ్డి ఒరెల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ధరణిలో అదే భూమికి ఓనర్లుగా ఇంద్ర రెడ్డి, నర్సింహ రెడ్డి పేర్లు ఉంచారు. అప్పటి నుంచి లేక్ విల్లా ఫ్లాట్స్‎లోకి శ్రీనివాస్ రెడ్డి, రాఘవ రెడ్డి వెళ్లి జెసీబీలతో అక్రమంగా చోరబడి బెదిరింపులకు పాల్పడుతున్నారు. గత నెలలోనూ తమను బెదిరించారని లేక్ విల్లా ప్లాట్ ఓనర్స్ అంటున్నారు. లేక్ విల్లాతో పాటు ఇంకొన్ని భూములను కూడా వీరు ఇదే తరహాలో కబ్జా చేశారని లేక్ విల్లా ప్లాట్ ఓనర్స్ చెబుతున్నారు.