దారుణం..ఫ్రెండ్స్ తో ఛాలెంజ్ చేసి బాలికపై కామాంధుడు అత్యాచారం

0
106

దేశంలో అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. కామాంధుల అఘాయిత్యాలకు మహిళల జీవితాలు నాశనం అవుతున్నాయి. దేశంలో ఇప్పటికే జరిగిన అత్యాచారాల కారణంగా ఎంతోమంది మహిళల జీవితాలు చీకటిమయమయ్యాయి. తాజాగా  ఝార్ఖండ్​లోని ధన్​బాద్​లో దారుణం చోటుచేసుకుంది.

వివరాల్లోకి  వెళితే..ధన్​బాద్​కు చెందిన ఇద్దరి  యువకుల మధ్య ఓ మైనర్ బాలిక  విషయమై తనను ప్రేమిస్తోందంటే.. తననే ప్రేమిస్తోందని గొడవ జరిగింది. దీంతో సంజయ్ అనే యువకుడు ఆ బాలిక తననే ప్రేమిస్తుందని నిరూపిస్తానని స్నేహితులకు ఛాలెంజ్ చేశాడు. ఆ తరువాత బాలికకు మాయ మాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడుతూ వీడియో తీసాడు. ఈ వీడియోను తన స్నేహితులకు షేర్ చేయగా..ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.