Home హెల్త్ Carona: Good news..తగ్గిన కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?

Carona: Good news..తగ్గిన కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?

0
224
RT-PCR mandatory

భారత్ లో కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతాఇంతా కాదు. ఈ మహమ్మారి దెబ్బకు వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పటికే మూడు వేవ్ లుగా వచ్చిన ఈ మహమ్మారి ఎంతోమందిని పొట్టనబెట్టుకున్నాయి. ఇక తాజాగా కేంద్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం..గత 24 గంటల్లో..4037 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దేశంలో కరోనా పాజిటివిటి రేటు 90.01 శాతంగా ఉంది. ఇక కరోనా వ్యాక్సిన్ల విషయానికొస్తే దేశ వ్యాప్తంగా 2.16 కోట్ల మంది టీకాలు వేసుకున్నారు. కానీ కరోనా ఇంకా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టలేదని, బయటకు వెళ్తే మాస్క్ పెట్టుకోవడం సహా ఇతర జాగ్రత్తలు తీసుకొవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మొత్తం కేసులు: 4,45,43,089

మరణాలు:  5,28,370

యాక్టివ్ కేసులు: 47, 379

రికవరీలు: 4,39,67, 340