Flash: ఏపీలో దారుణం..పిల్లల ముందే వివాహితపై కానిస్టేబుల్ కొడుకు అత్యాచారం

0
75

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వరుస దారుణాలతో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. మహిళలపై, చిన్నారులపై దుండగుల అఘాయిత్యాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు, కఠిన చర్యలు తీసుకువస్తున్నా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు మాత్రం అరికట్టలేకపోతున్నారు పోలీసులు.

ఇప్పటికే దేశంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. తాజాగా ఏపీలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. విజయనగరం జిల్లాలో రాత్రి ఓ వివాహిత తన పిల్లలు, సోదరుడిని పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తుండగా..అర్థరాత్రి ఓ హెడ్‌కానిస్టేబుల్‌ కొడుకు చెర్రీ అతని స్నేహితులతో కలిసి వివాహితపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

బాధితులు దాక్కున్నా వదలకుండా సోదరుడు, ఆమె పిల్లలు చూస్తుండగానే కామాంధుడు ఈ దారుణానికి పాల్పడినట్టు బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది. దాంతో పోలీసులు కేసు  చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైద్య పరీక్షల కోసం మహిళను ఆసుపత్రికి తరలించారు.