మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్..

0
151

మొగల్ పురా పీఎస్ పరిధికి చెందిన ఓ మైనర్ బాలికను క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేసిన ఘటన జూబ్లీహిల్స్ లో చోటుచేసుకుంది. ఆ బాలిక నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లగా..లుక్మాన్ అనే క్యాబ్ డ్రైవర్ తనను రంగారెడ్డి జిల్లాలోని ఏదో ఊరికి తీసుకెళ్లాడని బాలిక పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై మొగల్పురా పోలీసులు విచారించగా..లుక్మాన్ బాలికను రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ గ్రామానికి తీసుకెళ్లానని తెలిపాడు. లుక్మాన్కు ఆశ్రయమిచ్చిన మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.