తిరుమల భక్తులకు గుడ్ న్యూస్..కాళ్ళు కాలకుండా గ్రీన్ కార్పెట్

0
35

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో భక్తులు  కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి దేశవిదేశాల నుండి భక్తులు అధికసంఖ్యలో తండోపతండాలుగా తరలివస్తున్నారు. దాంతో తిరుమల పరిసరప్రాంతాల్లో ఉండే కాంప్లెక్స్‌లు నిండిపోయి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశ్యంతో  భక్తులకు అన్నప్రసాదం, తాగు నీరు, చంటి పిల్లల కోసం పాలు ఇవ్వడం వంటి ఆర్థిక సహాయాలు చేస్తూ కొంత మేరకు ఆదుకుంటున్నారు.

అయితే తాజాగా తిరుమల కొండపైకి కాలినడకన వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉండడానికి టీటీడీ చక్కని వెసులుబాటు కల్పిస్తున్నారు. అలిపిరి నుంచి తిరుమలకు నడచి వచ్చే భక్తులు ఎండ వేడితో కాళ్లు కాలుతూ ఇబ్బందులు పడుతున్నట్టు గమనించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గ్రీన్ కార్పెట్ ఏర్పాటు చేసి దాని మీద నీళ్లు చల్లించే ఏర్పాటు చేశారు. వేసవిలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆయన తెలిపాడు.