తెలంగాణలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఆ తండ్రికి ఏం కష్టమొచ్చిందో కానీ తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. వారి మృతితో ఆ గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే..నల్గొండ జిల్లా దామెరచర్ల మండలంలోని నునావత్ తండాలో కిషన్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కుటుంబకలహాల నేపథ్యంలో కిషన్ రాత్రి భార్యతో గొడవపడ్డాడు.
క్షణికావేశంలో అతను ఇద్దరు కుమారులకు విషమిచ్చి చంపేశాడు. అనంతరం వారికి ఉరివేసి.. తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని..మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.