Home క్రైమ్ Flash News- తెలంగాణలో దారుణం..రూ.2 వేలు దొరకలేదని యువకుడు ఆత్మహత్య!

Flash News- తెలంగాణలో దారుణం..రూ.2 వేలు దొరకలేదని యువకుడు ఆత్మహత్య!

Atrocities in Telangana..Suicide for not finding Rs 2 thousand!

0
164

తెలంగాణ: మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం పొన్నాలలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మర్యాల ఆనంద్‌(23) తుర్కపల్లిలోని ఓ బయోటెక్‌ సంస్థలో పని చేస్తున్నారు. మూడు నెలల క్రితం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం ప్రజ్ఞాపూర్‌కు చెందిన కుంచెరుకలి (ఊరూరా తిరిగి అప్పిచ్చే వారు) వద్ద రూ.10వేలు అప్పు తీసుకున్నాడు.

అప్పును తీర్చాలని ఓ మహిళతో పాటు మరో ఐదుగురు ఈ నెల 22న పొన్నాలలోని ఆనంద్‌ ఇంటికి వచ్చారు. తీవ్ర ఒత్తిడి చేశారు. కనీసం రూ.2 వేలు ఇస్తే కొత్త పత్రం రాసుకొని వెళ్తామని మొండికేసి కూర్చున్నారు. తెలిసిన వారిని బతిమాలిడితే ఒకరు రూ.వెయ్యి ఇచ్చారు. వాటితో వారికి విందు ఇచ్చాడు. వారు కొత్త పత్రం రాసుకొని వెళ్లి పోయారు.

ఇంటికొచ్చిన ఆనంద్‌ రూ.2 వేల కోసం తనను ఎవరూ నమ్మలేదని మనస్తాపంతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.