విశాఖలో మరో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించలేదని అక్కసుతో యువతిపై వరంగల్ కు చెందిన హర్షవర్ధన్ రెడ్డి పెట్రోల్ పోసి నిప్పంటించారు. అనంతరం నిందితుడు నిప్పటించుకున్నాడు. స్థానికులు వారిద్దరిని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో యువతి 60 శాతం గాయపడ్డట్టు తెలుస్తుంది. కాగా, ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీలో ప్రేమ పేరిట దారుణం
Atrocities in the name of love in the AP