Baby sale:కన్నబిడ్డకు ఖరీదు పెట్టిందో తల్లి.. ఏడు రోజుల శిశువును 50 వేలకు అమ్మేసిందా కన్నతల్లి. ఈ దారుణ ఘటన విజయవాడలో జరిగింది. విజయవాడలోని భానునగర్‌కు చెందిన ఓ తల్లి.. శిశువును విక్రయించినట్లు ఆశా వర్కర్లు, స్త్రీ శిశు సంక్షేమసాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా శిశు విక్రయం కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. డబ్బుల కోసమే బెంగళూరుకు చెందిన మాల్యాద్రి, నాగమణిలకు శిశువు అమ్మినట్లు పోలీసుల విచారణ తేలింది. వారితో పాటు.. శిశువు విక్రయంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన సత్యవతి, ధనలక్ష్మి, అనితే మరో ముగ్గురు మహిళలను, శిశువు తల్లిదండ్రులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శిశువును చైల్డ్‌లైన్‌కు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు పంపించినట్లు తెలిపారు. శిశువు క్రయవిక్రయాలు (Baby sale) చట్టరీత్యా నేరమనీ.. ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Baby sale: 50 వేలకు శిశువును అమ్మేసిన తల్లి
-
- Advertisement -