ప్రి వెడ్డింగ్ షూట్‌‌లో వధువరులపై తేనెటీగల దాడి..పరిస్థితి విషమం..

-

పెళ్ళి అనేది జీవితంలో ముఖ్యమైన ఘట్టం. ఈ పరిణయ మహోత్సవన్నీఅందరు ఉత్సవంగా చేసుకుంటున్నారు. పెళ్లిళ్లకు, ప్రీ వెడ్డింగ్ షూట్లకు, సంగీత్, బ్యాచ్ లర్ పార్టీలు అంటూ ఇలా అనేక ఖర్చులు పెట్టి వివాహం జరుపుకుంటారు. ఈ పెళ్ళి అనే ఘట్టం తీపి గుర్తుగా ఉండాలని రకరకాల ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు.

- Advertisement -

ఈ  మధ్య కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో వధూవరులు ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసుకోవాలని ముచ్చటపడుతున్నారు. కానీ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కారణంగా ఒక జంట ప్రాణాలమీదికి వచ్చింది. ఇలా చాలామంది ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. కానీ తాజాగా ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కారణంగా ఒళ్ళు గాగుల్పొడిచే సంఘటన రంగారెడ్డి జిల్లా  కోహెడలో జరిగింది. ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్న సమయంలో తేనెటీగలు దాడి చేయడంతో..వధువు, వరుడు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రస్తుతం వీరిద్దరిని ఐసీయూలో ఉంచి వైద్యుల సమక్షంలో చికిత్స అందిస్తున్నారు. ఎల్లుండి పెళ్లి చేసుకొని ఆనందంగా ఉండేవాళ్ళు కానీ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కారణంగా ప్రాణాలమీదికి తెచ్చుకున్నారు. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు ఆందోళన చెందుతున్నాయి. పెళ్లికి ముందు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో వధూవరుల పరిస్థితి అత్యంత కఠినంగా ఉండటంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Skincare Tips | సమ్మర్‌లో చర్మాన్ని ఇలా కాపాడుకోండి!

Skincare Tips | వేసవి వస్తుందంటే సవాలక్ష సమస్యలు కూడా ఇబ్బంది...

Prasanth Varma | మోక్షజ్ఞ లాంచ్.. రేస్ నుంచి తప్పుకున్న యంగ్ డైరెక్టర్

Prasanth Varma - Mokshagna | నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ...