బ్రేకింగ్..బంగ్లాదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం

0
107
Kabul

బంగ్లాదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం అర్ధరాత్రి చిట్టగాంగ్ ప్రాంతంలోని ఓ షిప్పింగ్ కంటైనర్ డిపోలో రసాయన పేలుడు సంభవించడంతో భారీ ప్రాణనష్టం చవిచూడవలసి వచ్చింది. ఈ ఘటనలో ఏకంగా 35 మంది అక్కడికక్కడే మృతి చెందగా..మరో 300 మందికిపైగా తీవ్ర గాయాలు అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో 40 మంది అగ్నిమాపక సిబ్బంది, 10 మంది పోలీసులు గాయాలు కాగా..ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది మరణించారు. ఇంకా మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.