Breaking News : ఎసిబి వలలో మరో తహశీల్దార్ సునీత

0
119

ఇటీవల కాలంలో మహిళా ఎమ్మార్వోలు లంచాలు తీసుకుంటూ ఎసిబికి పట్టుబడుతున్నారు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం తహశీల్దార్ సునీత ఎసిబి వలలో చిక్కారు.

తహశీల్దార్ సునీత 2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కొత్తపల్లికి చెందిన
ఐత హరికృష్ణ అనే వ్యక్తి కొత్తపల్లి శివారులోని సర్వే నెంబరు 3లో భూమికి ఆన్లైన్ చేసి పట్టా పాస్ బుక్కుల కోసం సదరు తహశీల్దార్ సునీత 3 లక్షలు డిమాండ్ చేశారు. ఇవాళ బాధితుడి నుంచి 2 లక్షలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.

ఆమెపై కేసు నమోదు చేసిన ఎసిబి అధికారులు మరిన్ని వివరాలు ఆరా తీస్తున్నారు. బాధిత రైతు దివ్యాంగుడు కావడం గమనార్హం.