మీరు ఎక్కువగా హెయిర్ లాస్ అవుతున్నారా – ఈ తప్పులు మాత్రం చేయకండి

Are you becoming more hair loss - Don't make these mistakes

0
34

ఎండాకాలం, శీతాకాలం కంటే రెయినీ సీజన్ లో హెయిర్ లాస్ అనేది చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా చుండ్రు ఎక్కువ పడుతుంది. అంతేకాదు తడిచిన తర్వాత జుట్టు ఊడిపోవడం కూడా జరుగుతుంది. చాలా మందికి ఈ సమయంలో జుట్టు రాలే సమస్య ఉంటుంది. షాంపులు మార్చినా మెడిసన్స్ వాడినా ఈ సమస్య అనేది పోదు. అయితే కొన్ని తప్పుల వల్ల జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుందట. సో ఇలాంటి తప్పులు మీరు చేస్తున్నారేమో చూడండి. ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తపడండి.

1. ఈ వర్షాకాలం ఎక్కువగా హెయిర్ జెల్, హెయిర్ ఆయిల్స్ వాడవద్దు. రంగు కూడా అతిగా వేయవద్దు.
2. రోజూ కొబ్బరినూనె తలకి రాసేవారు వారానికి రెండు సార్లు మాత్రమే ఈ సీజన్లో రాసుకోండి.
3. షాంపూ స్నానం వారానికి రెండు, మూడు సార్లు మాత్రమే చేయాలి.
4.బ్లో-డ్రైయర్స్ -హీట్ స్టైలింగ్ ఎక్కువగా వాడవద్దు.
5. ఫాస్ట్ ఫుడ్స్ మసాలా పోపులు ఇలాంటివి ఎక్కువ తీసుకోకండి
6.ఆకుపచ్చ కూరగాయలు, సలాడ్, పెరుగు, మజ్జిగ, తాజా పండ్లు, మొలకలు ఫుడ్ గా తీసుకోండి.
7. తడిగా ఉన్న సమయంలో జుట్టు అస్సలు తుడవద్దు.
8. జుట్టును తువ్వాలతో గట్టిగా తుడుస్తారు ఇలా కూడా చేయవద్దు.