తెలంగాణాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తమ కుమార్తెకు ఇష్టం లేని పెళ్లి చేయడంతో విషం తాగి నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..గుజ్జల పద్మకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండగా పెద్ద కుమార్తె లక్ష్మి పెళ్లి చేద్దామని కుటుంబ సభ్యులు నిశ్చయించుకొని అనంతపురం జిల్లాకు చెందిన మల్లేష్ తో పెళ్లి జరిపించడానికి అన్నిసన్నాహాలు చేసారు.
తనకు ఇష్టం లేదనీ చెప్పిన వినకుండా శుక్రవారం ఉదయం ఆమెకు పెళ్లి జరిపించారు. సాయంత్రం అప్పగింతల సమయంలో విషం తాగి నవవధువు ఆత్మహత్య చేసుకోవడంతో అది గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిగా ఆసుపత్రికి తరలించారు. కానీ అంతలోనే నవవధువు మృతి చెందిందని వైద్యులు చెప్పడంతో కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు కన్నీటి పర్యంతం అయ్యారు.






