Gold Smuggling |అక్రమంగా బంగారం తరలిస్తున్న మహిళను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన భారత్ – బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో జరిగింది. పశ్చిమ బెంగాల్ లోని నార్త్ 24 పరాగణాస్ జిల్లాలోని చెక్ పోస్ట్ వద్దనున్న బీఎస్ఎఫ్ జవాన్లకు బంగ్లాదేశ్ నుండి స్మగ్లర్ బంగారంతో సరిహద్దు దాటుతున్నట్లు సమాచారం వచ్చింది. వెంటనే అప్రమత్తమైన మహిళా బీఎస్ఎఫ్ జవాన్లు తనిఖీలు చేస్తున్న క్రమంలో మాణికా ధర్ అనే 34 ఏళ్ళ మహిళా ను అనుమానంతో తనిఖీ చేయగా ఆమె వద్దనుండి 27 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు.
Gold Smuggling |బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ కు చెందిన స్మగ్లర్ గుడ్డలో 27 బంగారు కడ్డీలను పెట్టుకొని నడుముకు చుట్టుకొని తరలిస్తోంది. దాదాపు అది 2 కేజీ కు పైగా ఉంటుందని, దాని విలువ 1.29 కోట్లు ఉండనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆమెను విచారణ చేయగా బంగారు కడ్డీలను పశ్చిమ బెంగాల్ లోని బరాసత్ లో గుర్తు తెలియని వ్యక్తికి చేరవేయాలని సూచించినట్లు ఆమె తెలిపింది. అందుకు 2000 రూపాయలను అందుకోనున్నట్లు, అదే విధంగా ఈ పని చేయడం మొదటిసారి అని అంగీకరించింది.
Read Also: రిషిసునాక్ బ్రిటన్ ప్రధాని అవ్వడానికి నా కూతురే కారణం: సుధామూర్తి
Follow us on: Google News, Koo, Twitter