ఆర్టీసి సిటీ బస్సు సక్కగ నడవాలంటే కండక్టర్, డ్రైవర్ మధ్య సమన్వయం బాగుండాలె. వారిద్దరి మధ్య సమన్వయం లేకపోతే రైట్ ఒకరు లెఫ్ట్ ఒకరు అన్నట్లుంటే అంత ఆగమాగం అయితది. ఇక్కడ కూడా ఇదే కథ అయింది. అదేంటో చదవండి.
బుధవారం నాడు ఒక బస్సు కోఠి నుంచి దిల్ సుఖ్ నగర్ వెళ్లున్నది. బస్సులో కండక్టర్ ఉన్నారా లేరా అని చూసుకోకుండా డ్రైవర్ బస్సు కదిలించిండు. బస్సు పోతనే ఉన్నది. ఇంతలో బస్సు పోతున్న విషయాన్ని గుర్తించి సదరు మహిళా కండక్టర్ డ్రైవర్ కు ఫోన్ చేసి క్లాస్ పీకారు.
ఇంకేముంది ఆ బస్సును ముందు స్టాప్ లో ఆపేశాడు డ్రైవర్. సదరు మహిళా కాండక్టర్ ఇంకో బస్సు ఎక్కి పక్క స్టాప్ వచ్చిన తర్వాత దిగి తన బస్సులో ఎక్కేశారు. మొత్తానికి ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడంతో వారిద్దరే కాకుండా ప్రయాణికులకు కూడా తిప్పలు తప్పలేదు.