బిజెపిలో చేరిన మంత్రి హరీష్ రావు మద్దతుదారుడు

Minister Harish Rao supporter joined the BJP

0
37

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మద్దతుదారుడు, సన్నిహితుడైన మాజీ టిఎంయూ సెక్రటరీ అశ్వథ్తామ రెడ్డి బిజెపిలో చేరారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో పాటు ఢిల్లీ వెళ్లి అశ్వథ్థామ బిజెపి తీర్థ: పుచ్చుకున్నారు. ఈటలతోపాటు తుల ఉమ, ఏనుగ రవీందర్ రెడ్డి కూడా బిజెపిలో చేరిన వారిలో ఉన్నారు.

అశ్వథ్థామరెడ్డి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆర్టీసి సంఘంలో చీలిక తీసుకొచ్చి టిఎంయు ను ఏర్పాటు చేయడంలో హరీష్ రావు, అశ్వథ్థామరెడ్డి కీలక పాత్ర పోశించారు. తర్వాత టిఎంయూ కు కార్యదర్శిగా పనిచేశారు.

తెలంగాణ వచ్చిన తర్వాత కొంతకాలం అశ్వథ్థామను కేసిఆర్ సహించలేకపోయారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసి కార్మికులు ఆందోళనబాట పడితే కేసిఆర్ లెక్కచేయలేదు. వారి సమస్యలను పట్టించుకోలేదు. కోర్టులు కొడతాయా అని డోంట్ ఖేర్ అన్నట్లు వ్యవహరించారు. ఆ సమయంలో ఆర్టీసి సంఘాన్నే కాదు ఆర్టీసినే మూసి పడేస్తానని వార్నింగ్ ఇచ్చారు.

దీంతో కార్మికులు విధిలేని పరిస్థితిలో అవమానకరంగా సమ్మెను విరమించారు. తర్వాత అనివార్యంగా ఆర్టీసి గుర్తింపు సంఘం నేతగా ఉన్న అశ్వథ్థామరెడ్డి సంఘం పనులు బంద్ చేసి ఉద్యోగంలో చేరాలని నోటీసులు పంపింది ఆర్టీసి యాజమాన్యం. దీంతో ఉద్యమ నేతగా ఉండి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోశించిన తనను టిఆర్ఎస్ సర్కారు ఘోరంగా అవమానించిందని భావించి అశ్వథ్థామ రెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేయడం, యూనియన్ బాధ్యతల నుంచి తప్పుకోవడం జరిగిపోయాయి. తాజాగా ఆయన బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.

అయితే ఆర్టీసి సమ్మె కాలంలో కేసిఆర్ వర్సెస్ అశ్వథ్థామ అన్నట్లుగా వాతావరణం నడిచింది. ఆ సమయంలో Shadow Tv అనే యూట్యూబ్ ఛానెల్ అశ్వథ్థామరెడ్డిని ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ లో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. పక్కన ఉన్న వీడియోను క్లిక్ చేసి చూడొచ్చు..https://youtu.be/KU3aHoKpmz0