సూపర్ మార్కెట్ లో సరుకులు కొంటున్నారా? అయితే జాగ్రత్త – హైదరాబాద్ లో ఏం జరిగిందో చూస్తే షాక్!

Buying goods in the supermarket? Be careful though -

0
119

హైదరాబాద్ కూకట్పల్లి రెయిన్బో విస్టా రాక్ గార్డెన్ విజేత సూపర్ మార్కెట్ పై GHMC అధికారులు కొరడా ఝులిపించారు. 7 రోజుల్లో సూపర్ మార్కెట్ మూసేయ్యాలని నోటీసులు జారీ చేశారు. సరైన నిర్వహణా ప్రమాణాలు పాటించకపోవడం, తరచుగా ఫిర్యాదులు వస్తున్న కారణంగా విజేత సూపర్ మార్కెట్ 7 రోజుల్లో ఖాళీ చెయ్యాలని GHMC మూసపెట్ సర్కిల్ హెల్త్, శానిటేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు.

18.10.2021న వినియోగదారుల ఫిర్యాదు చేయగా అప్పట్లో తనిఖీలు చేసిన GHMC అధికారులు ఆరోపణలు నిజమేనని గుర్తించి 5 వేల రూపాయల జరిమానా విధించారు. అయినప్పటికీ సూపర్ మార్కెట్ యాజమాన్యం తీరు మారలేదు.

నిన్నటిరోజు (21.01.2022) న కస్టమర్ల ఫిర్యాదు మేరకు GHMC అసిస్టెంట్ మెడికల్ అధికారి సంపత్, ఫుడ్ ఇన్స్పెక్టర్ నిహారిక లు రెండోసారి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సమయంలో కాలం చెల్లిన తిను బండారాలతో పాటు బొద్దింకలు, ఎలుకలను గుర్హించారు. దీంతో వినియోగదారుల ఆరోపణలు నిజమేనని అధికారులు నిర్ధారించారు.

సూపర్ మార్కెట్ లోని ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించిన అధికారులు వాటిని ల్యాబ్ కు పంపారు. 7 రోజుల్లోగా సూపర్ మార్కెట్ మూసివేయాలని లేని పక్షంలో GHMC నిబంధనల ప్రకారం లీగల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నోటీసులో అధికారులు పేర్కొన్నారు. దీనితో సూపర్ మార్కెట్ లో సరుకులు కొన్నవారు నోరెళ్లబెడుతున్నారు. ఇన్నిరోజులు తాము కాలం చెల్లి, నాణ్యత ప్రమాణాలు పాటించని మార్కెట్ లో కొంటున్నామా అని ప్రశ్నించుకుంటున్నారు.