పాతకక్షల నేపథ్యంలో ఘర్షణ..ఒకరికి తీవ్ర గాయాలు

0
90

దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు వంటి ఘటనలు నిత్య కృత్యంగా మారాయి. ఇక తాజాగా ఏపీ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో దాడి స్థానికంగా కలకలం రేపింది.

ఈ ఘర్షణలో షాగం శేషారెడ్డి పై మచ్చు కత్తి, ఇనుప రాడ్డు,రాళ్లతో దాడి చేశారు. దీనితో తలకు బలమైన గాయాలు అయ్యాయి. క్షతగాత్రున్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.