ఖాళీ కడుపుతో కాఫీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త..

0
103

ఉదయం లేచిన వెంటనే కప్పు చాయ్, కాఫీనో తాగే వారి సంఖ్య బాగానే ఉంటుంది. లేదంటే, వారికీ ఏ పని చేయబుద్ధికాక చిరాకుగా ఫీల్ అవుతారు. హ్యాపీగా ఉన్నా..బాధగా ఉన్నా..నీరసంగా ఉన్నా.. అలసటగా ఉన్నా..తలనొప్పిగా ఉన్నా వెంటనే గుర్తొచ్చే మాట చాయ్. అయితే ఇలా రోజులో ఎప్పుడు పడితే అప్పుడు చాయ్, కాఫీ తీసుకోవడం మంచిది కాదంటున్నారు వైద్యులు.

ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అది కడుపు ఉబ్బరం లేదా జీర్ణాశయంలో గ్యాస్ ఏర్పడటానికి కారణం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఖాళీ కడుపుతో పాలతో తయారు చేసిన టీలు తీసుకోవద్దు.

టీ, కాఫీలు ఆమ్ల స్వభావం కలిగి ఉండటం వల్ల ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరంలో యాసిడ్-ఆల్కలీన్ సమతుల్యత దెబ్బతింటుందని తెలిపారు. దీనివల్ల ఎసిడిటీ వచ్చే ప్రమాదం ఉంది. మీకు అంతగా టీ తాగాలనిపిస్తే..గోరువెచ్చని నీటిలో ఒక చిటికెడు ఉప్పు, నల్ల మిరియాలు కలిపి కప్పు నిమ్మరసం లాంటి హెర్బల్ టీలు తాగవచ్చని చెప్పారు.