జ్యోతిష్యుడి ఇంట్లో చోరీ : 40 లక్షల విలువైన జాతక రాళ్లు మాయం

0
138

రాచకొండ కమిషనరేట్ పరిధిలో జాతక రాళ్లు డోపిడీకి గురయ్యాయి. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ న్యూ వెంకటరమణ కాలనీలో చోరీ జరిగింది. కాలనీలోని బాల మురళీ కృష్ణ అనే జ్యోతిష్యుని ఇంట్లో సుమారు 40 లక్షలు విలువజేసే జాతకం (రంగు) రాళ్లు అపహరణకు గురయ్యాయి. దీనిపై బాధితుడు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే ప్రత్యేక పోలీస్ టీమ్ లను రంగంలోకి దింపి దర్యాప్తు చేస్తున్నారు ఎల్బీ నగర్ పోలీసులు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.