పనసపండు తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే

These are the benefits of eating Jackfruit

0
44

పనస పండు చాలా మంది ఇష్టంగా తింటారు. అంతేకాదు ఆ గింజ‌ల‌తో వంట‌కాలు చేస్తారు. ప‌న‌స ప‌చ్చ‌డి ప‌న‌స బిర్యానీ కూడా ఈ మ‌ధ్య చాలామంది చేస్తున్నారు. ఎన్నో ఔషద గుణాలు కలిగిన ఈ ప‌న‌స పండు రుచి మాత్రమే కాదు ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఈ పండు ఎక్కువ‌గా మ‌న భారత్ లో పండుతుంది.

ప‌న‌స పండు జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్దకాన్ని తగ్గిస్తుంది. మధుమేహ రోగులకు ఎంత‌గానో ప్ర‌యోజ‌నం చేకూరుస్తుంద‌ని అంటున్నారు వైద్య నిపుణులు. ఇది తీయ‌గా ఉంటుంది క‌దా మ‌రి షుగ‌ర్ పేషెంట్లు తిన‌కూడ‌దు అని చాలా మంది అనుకుంటారు.

కాని ఈ పనసపండు శరీరంలోని గ్లూకోస్‌, ఇన్సులిన్‌, గ్లెసెమిక్‌ స్థాయిలను నియంత్రిస్తుంది. ఇక ఇమ్యునిటీ ప‌వ‌ర్ కూడా పెంచ‌డంలో సాయ‌ప‌డుతుంది. ఇక రోజుకి రెండు ప‌న‌స తొన‌లు తిన్నా మంచిదే, అయితే ఏదైనా అతి ప్ర‌మాద‌క‌ర‌మే, అతిగా ప‌న‌స పండు తింటే జీర్ణస‌మ‌స్య‌లు వ‌స్తాయి. కొంద‌రు ప‌ది నుంచి 15 తొన‌లు తింటారు. దీని వ‌ల్ల క‌డుపు నొప్పి, వికారం స‌మ‌స్య కూడా రావ‌చ్చు. మితంగా తీసుకుంటే ప‌న‌స చాలా మంచిది.