5 వ తరగతి పిల్లలకు కండోమ్స్ – ఈ స్కూల్లో సంచలన నిర్ణయం

Condoms for 5th class children's-Sensational decision at this school

0
42

5 వ తరగతి అంటే పిల్లలకు 11 నుంచి 12 ఏళ్ల వయసు ఉంటుంది. మరి ఆ పిల్లలకు కండోమ్స్ ఎందుకు అంటే. అమెరికాలోని చికాగో పబ్లిక్ స్కూల్స్ ఎడ్యుకేషన్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.5వ తరగతి ఆ పై తరగతుల విద్యార్ధులకు పాఠశాలల్లో కండోమ్స్ అందుబాటులో ఉండేలా చూడాలని నిర్ణయించింది. ఆ వయసు నుంచే సెక్స్ ఎడ్యుకేషన్ అవసరమని నిర్ణయం తీసుకున్నారు.

లైంగిక సంక్రమణ వ్యాధులు, అవాంఛిత గర్భాలను నివారించడానికే ఇదే మార్గమని ఈ బోర్డు అభిప్రాయ పడింది. స్కూల్ నుంచి ఈ మధ్య ప్రేమలు, డేటింగులు జరుగుతున్నాయి కొందరు గర్భందాల్చుతున్నారు. అందుకే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. కాని బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని పేరెంట్స్ వ్యతిరేకిస్తున్నారు. పిల్లలను ఎడ్యుకేట్ చేయాలి కాని ఇలా చేయకూడదు అని చెబుతున్నారు.

బోర్డు కూడా పేరెంట్స్ అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పింది. ఆ బోర్డు పరిధిలోని 600 స్కూళ్లకు ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ కొత్త నిబంధన వర్తించనుంది. ఇప్పుడు ఈ బోర్డు తీసుకున్న నిర్ణయం గురించి పెను చర్చ జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా.