తెలంగాణాలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇప్పటికే ఎన్నో ప్రేమజంటలు కులాలు వేరుకావడం, పెద్దలు అంగీకరించకపోవడం కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. తాజగా ఇలాంటి ఘటనే జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. తమ పెళ్ళికి పెద్దలు ఒప్పుకోరన్న మనస్తాపంతో ప్రేమికులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో ఇరు కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.