తనను అడ్డగోలుగా తిట్టిండన్న కోపంతో ఒక వ్యక్తి మర్మాంగాన్ని, చెవిని కోసేసిన సంఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. కొత్తగూడెం పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ కు చెందిన రుద్రారపు కార్తీక్ తోపుడు బండిపై హర్ ఏక్ మాల్ సామాగ్రి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన వృత్తిలో భాగంగా హైదరాబాద్ నుంచి కొత్తగూడెం రుద్రంపూర్ ఏరియాకు 6 రోజుల కిందట వలస వచ్చాడు. రుద్రంపూర్ లో శిథిలమై పాడుబడ్డ బంగ్లాలో తాత్కాలికంగా నివాసం ఏర్పాటు చేసుకున్నాడు.
రుద్రంపూర్ ప్రాంతంలో కూలి పనిచేసుకుంటూ నివశిస్తున్న హుస్సేన్ పాషా మంగళవారం అర్ధరాత్రి పీకలదాకా తాగి మత్తులో కార్తీక్ ను దుర్భాషలాడాడు. దీంతో మాట మాట పెరిగి ఇద్దరి నడుమ గొడవ పెరిగి పెద్దదైంది. కోపంతో రగిలిపోయిన కార్తీక్ వెంటనే హుస్సేన్ పాషా చెవిని, మర్మాంగాన్ని కత్తితో కోసేశాడు.
ఆ తర్వాత డయల్ -100కు ఫోన్ చేసి ఏం జరిగిందో వివరించాడు. బాధితుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడు కార్తీక్ ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Shocking News : మర్మాంగం, చెవి కోసి డయల్ -100 కు ఫోన్ చేశాడు
Cut off his Penis , ear and called Dial-100