మరియమ్మ లాకప్ డెత్ పై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కు అభిమాని సూటి ప్రశ్న

0
42
తెలంగాణలో దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ సంచలనం రేపింది. పోలీసులు ఆమెను కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక ఆమె స్టేషన్ లోనే కన్నమూసింది. అంతేకాదు ఆమె తనయుడిని సైతం పోలీసులు పాశవికంగా ఒల్లు హూనమయ్యేలా కొట్టారు. ఎక్కడికక్కడ వాతలు వచ్చేలా లాఠీలతో ఆ యువకుడిని కుళ్లబొడిచారు. దీనిపై దళిత నేతలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజాసంఘాల నేతలు అందరూ ముక్తకంఠంతో స్పందించారు. పోలీసుల తీరుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది. డిజిపిని కలిసి కాంగ్రెస్ నేతలు వినతిపత్రం కూడా సమర్పించారు.
దీంతో ప్రభుత్వం ఈ ఘటనకు కారణమైన పోలీసులను సస్పెండ్ చేసింది. ఈ విషయంలో కాంగ్రెస్ నేతగా ఉన్న అద్దంకి దయాకర్ ఇప్పటి వరకు స్పందించలేదన్న ఆవేదనతో ఆయన అభిమాని సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. అ పో్స్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అద్దంకి అభిమాని సాయి తన పోస్టులో ఏముందో
కింద యదాతదంగా ఇచ్చాము చదవండి.
….
దళిత ఉద్యమ నాయకుడు , తుంగతుర్తి నుండి రెండు సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన అద్దంకి దయాకర్ గారు నియోజకవర్గ పరిధిలోని పోలీస్ స్టేషన్లో దళిత మహిళ లాకప్ డెత్ అంశంపై పోరాటం ఎందుకు చేయట్లేడు ?
ఓట్లేసి గౌరవించిన ప్రజల సమస్యల పై ఎందుకు స్పందించడం లేదు ?Addanki Dayakar ఉద్యమ నాయకుడిగా , ప్రశ్నించే నేతగా , విద్యావేత్తగా మంచి పేరు , రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న మీరు నియోజీకవర్గ సంభందిత వ్యవహారాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారో ప్రజలకు వివరించండి . మీకు ఇక్కడి వర్గ పోరు సమస్య అయితే ఇక్కడి కార్యకర్తలు మీకు అండగా ఉంటారు.
లేదు నాకు మళ్ళీ పోటీ చేయాలనే ఆలోచన లేదు అందుకే రాలేకపోతున్నా అని అయిన చెప్పండి . మీకు మద్దతుగా ఉన్న నాలాంటి కార్యకర్తలను ఈ ప్రశ్నలు ఇబ్బంది పెడుతున్నాయి.
May be an image of 1 person and beard