తెలంగాణ డీజీపీని సైతం వదలని సైబర్ నేరగాళ్లు

0
276

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురుద్దేశ్యంతో అమాయకులతో ఆడుకుంటున్నారు కేటుగాళ్లు. దీని కోసం కొత్త కొత్త ప్లాన్లతో సామాన్యులను బుట్టలో వేసి డబ్బులను దండుకుంటున్నారు. ఇక ఇప్పుడు కేటుగాళ్లు ఓ అడుగు ముందుకేసి రాష్ట్ర పోలీసు బాస్ పేరునే వాడుతూ డబ్బులు అడిగారు.

9785743029 అనే ఫోన్ నెంబర్ ను ఉపయోగించి డీజీపీ మహేందర్ రెడ్డి ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టి.. డబ్బులు అడిగినట్లు తెలుస్తోంది. సామాన్య ప్రజలు, పోలీసు సిబ్బంది, ఉద్యోగులు ఇలా చాలా మందికి వాట్సాప్ లో టోకరా ఇచ్చిన కేటుగాళ్లు..ఈ సారి ఏకంగా డీజీపీ మహేందర్ రెడ్డి ఫోటోతో ఉన్న వాట్సప్ అకౌంట్ నుంచి డబ్బులు కావాలని మెసేజ్ లు చేశారు. దీనిపై పోలీసులకు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తు మొదలు పెట్టింది. ఇలాంటి ఫేక్ రిక్వెస్ట్ లకు స్పందించవద్దని సూచించింది.