ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్..తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ

0
34

అమ్మ ఒడి మూడో విడత నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ప్రపంచంలో ఎక్కడికైనా వెల్లి బ్రతికే సత్తా , చదువుతోనే వస్తుందని.. దేశంలో అన్ని రాష్ర్టాల కంటే మిన్నగా మన పిల్లల చదువులు ఒక హక్కుగా అందాలని ముందుకు వెలుతున్నామని పేర్కొన్నారు.

అమ్మ ఒడి , నాడు నేడు , విద్యాకానుక , గోరుముద్ద , బై జ్యుస్ ఒప్పంద అన్నీ పిల్లల బవిష్యత్ కొసం తిసుకు వచ్చిన పధకాలే అని చెప్పారు. 43 లక్షలా 96 వేలమంది తల్లులకు, రూ. 6595 కోట్లు నేరుగా ఖాతాలలోకి వేస్తున్నామని ఈ సందర్బంగా సీఎం ప్రకటించారు.

అమ్మఒడి  పథకం కింద 1వ తరగతి నుంచి ఇంటర్ చదువుతోన్న విద్యార్థులకు ఏటా 15 వేల రూపాయలు ఇస్తారు. నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తున్నారు. అమ్మఒడి పథకం లబ్దిదారుల్లో  54 శాతం మంది బీసీలు, 21 శాతం మంది ఎస్సీలు, 6 శాతం మంది ఎస్టీలు, 19 శాతం మంది ఓసీలు ఉన్నారు.