ద‌ళిత కుటుంబం దారుణ హత్య..16 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్..

Dalit family brutally murdered, 16-year-old girl abused

0
91

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. యూపీలోని ఓ దళిత కుటుంబం హత్య, బాలికపై సామూహిక అత్యాచారం సంఘటన స్థానికంగా కలకలం రేపింది. భూ వివాదం నేపథ్యంలో ద‌ళిత కుటుంబానికి చెందిన న‌లుగురిని నిందితులు దారుణంగా హ‌త్య చేశారు.

దీంతో పాటు టీనేజ్ బాలిక‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘ‌ట‌న యూపీలోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో చోటుచేసుకుంది. ద‌ళిత కుటుబంలోని భూ య‌జ‌మాని (50), ఆయ‌న భార్య (47), కుమార్తె (17), కొడుకు(10)ని గ్రామానికి చెందిన కొందరు దుండగులు గొడ్డలితో నరికి హత్యచేశారు.

కాగా ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి 11 మంది నిందితుల్లో 8 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేసినట్లు ప్రయాగ్‌రాజ్ డీఐజీ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి తెలిపారు. బాధితులను గొడ్డళ్లతో దారుణంగా హ‌త్య చేశార‌ని పోస్ట్‌మార్టం నివేదిక‌లో వెల్లడైందన్నారు.