తెలంగాణాలో రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట శివారులో డీసీఎంను కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురిలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న డీసీఎం వాహనానికి మరమ్మతు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.