ఏపీలో ఓ మృతదేహం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విశాఖలోని ఫిషింగ్ హార్బర్ లోని 11వ నెంబర్ జెట్టీలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం అయింది. మృతి చెందిన వ్యక్తికి సుమారు 40-45 వయస్సు ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు. మూడు రోజుల కిందట మరణించి ఉంటారని, అయితే మృతదేహం ఎవరిది అనేది ఇంకా నిర్ధారించలేదు. ఇది హత్యా? ఆత్మహత్యా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.