దెయ్యాలున్నాయని ఊరంతా ఖాళీ- ఈ దెయ్యాల గ్రామం ఎక్కడుందంటే

Devil Special Story

0
64

 

ఈ రోజుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత డవల్ అయింది. అయితే ఇంకా కొన్ని చోట్ల మాత్రం దెయ్యాలు, భూతాలు ఉన్నాయని నమ్ముతారు. అంతేకాదు అక్కడ దెయ్యం ఉందని చెబితే ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లే సాహసం చేయరు. ఇక ఇలాంటి గ్రామాలు చాలా చోట్ల ఉన్నాయి. ఇక ఊరి అవతల రాత్రి పూట వెళ్లడానికి కూడా ఇంకా కొందరు జంకుతారు.

ముఖ్యంగా తీరని కోరికలతో చనిపోయినవారు దెయ్యాలుగా మారి మనుషుల మధ్యే నివసిస్తుంటారని పెద్దలు చెబుతుండేవారు. ఇప్పటికీ చాలా మంది దీనిని నమ్ముతారు. ఇవన్నీ అపోహాలు మాత్రమే అని శాస్త్రవేత్తలు కొట్టిపడేస్తారు. కాని ఓ గ్రామం గురించి ఇప్పుడు చెప్పుకుందాం.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఓ దెయ్యాల గ్రామం ఉంది. ఆ ఊర్లో మొత్తం ఎనిమిది దెయ్యాలు తిరుగుతుంటాయట. ఆ భయంతో గ్రామాన్ని జనం ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ ప్రాంతాన్ని భూటియన్ గా పిలుస్తుంటారు. ఉత్తరాఖండ్ చంపపత్ జిల్లాలోని స్వాలా ఈ గ్రామాన్ని భూత్ విలేజ్గా పిలుస్తుంటారు. మరి ఎందుకు ఇలా అందరూ మారారు అంటే. 1952 ఆర్మీ సైనికులు వెళ్తున్న కారు ఓ గుంటలో పడిపోయింది. ఆ కారులో మొత్తం 8 మంది సైనికులు ఉన్నారు. అయితే వారు ప్రమాదం జరిగిన తర్వాత సాయం కోసం ఆ ఊరి వాళ్లను ప్రాదేయపడగా ఎవరూ సాయం చేయలేదట. అలా వారు చనిపోయారు. దీంతో 8 మంది సైనికుల ఆత్మలు అక్కడే నివసిస్తున్నాయని భావిస్తారు జనం. అందుకే ఆ గ్రామాన్ని అందరూ ఖాళీ చేసి వెళ్లిపోయారు.