పాము కాటు వేయగానే వెంటనే వైద్యుల దగ్గరకు వెళతాం. అది విషపుపామా లేదా విషం లేని పామా అనేది వైద్యులు గుర్తిస్తారు. విషపు పాము కరిస్తే వెంటనే వైద్యులు చాలా మంది యాంటీవెనమ్ అనే మందును ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. ఇది అన్ని రకాల పాము కాట్ల నుంచి మనుషుల్ని కాపాడుతుంది. అయితే ఈ మందు ఎవరు కనుగొన్నారు అనేది చూస్తే.
1895లో ఫ్రాన్స్ ఫిజీషియన్ ఆల్బెర్ట్ కాల్మెట్టే ఈ మందు తయారుచేశారు. ఆయన నాగుపాము కాట్ల నుంచి ప్రజలను కాపాడేందుకు దాన్ని తయారుచేశారు. ఇది నేరుగా ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. ఎవరైనా సరే పాము కాటేసిన చోట గాయాన్ని కోసి విషాన్ని బయటకు తియ్యవద్దు. కొందరు కత్తితో గాట్లు పెడతారు విషం నోటినుంచి తీస్తామని రక్తం తీస్తారు ఇది చాలా ప్రమాదం.
టేపు లాంటిది, అలాగే కాటు వేసిన చోట క్రీములు రాయవద్దు. మద్యం, కాఫీ లాంటివి తాగవద్దు. కొన్ని వీడియోలు చూసి కాటు వేసిన చోట నోటితో విషం తీయవచ్చని బయటకు వస్తుంది అని అనుకరిస్తారు. ఇది రోగి ప్రాణానికి ప్రమాదం, ఇది విషం తీసేవారికి కూడా ప్రమాదమంటున్నారు వైద్యులు.