డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ పట్టుబడిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఆర్యన్ దోషిగా తేలితే ఏ శిక్ష పడుతుందో తెలుసా? ఆర్యన్‌పై నమోదైన కేసులను బట్టి అతడికి గరిష్ఠంగా పదేళ్ల శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించే అవకాశం ఉందని పలు సెక్షన్లు చెబుతున్నాయి.
ఒకవేళ తక్కువ మొత్తంలో డ్రగ్స్ లభ్యమైతే ఏడాది వరకు కఠిన కారాగార శిక్ష, లేదంటే రూ. 10 వేల జరిమానా విధిస్తారు. ఒక్కోసారి రెండింటినీ అమలు చేస్తారు. ఎక్కువ మొత్తంలో దొరికితే పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు.
వాణిజ్య పరమైన విక్రయాలు చేస్తూ దొరికితే పదేళ్ల నుంచి 20 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష, లక్ష నుంచి రెండు లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్యన్‌పై నమోదైన సెక్షన్లు బట్టి గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది.