చేసేది సాఫ్ట్ వేర్ జాబ్..అమ్మేది మాత్రం గంజాయి!

0
126

డ్రగ్‌ సరఫరా విచ్చలవిడిగా కొనసాగుతోంది. డ్రగ్స్‌ మాఫియాను రూపుమాపేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా చేపడుతున్నారు. ఇక హైదరాబాద్‌లో కూడా డ్రగ్స్‌ దందా విపరీతంగా కొనసాగుతుండటంతో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. తాజాగా మరో డ్రగ్స్‌ సరఫరా చేసే వ్యక్తిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్‌ సరఫరాలో పట్టుబడిన వ్యక్తిని చూసిన పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

ఎందుకంటే సరఫరా చేస్తున్నది ఓ మహిళ. అంతేకాదు ఆమె ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కూడా. నాచారంలో మాన్సీ అనే మహిళ భర్త మదన్‌ మనేకర్‌తో కలిసి రెండేళ్లుగా గంజాయి విక్రయిస్తోంది. మాన్సీ దంపతులు.. మరో ఇద్దరు యువకులతో కలిసి గంజాయి అమ్ముతుండగా బోయిన్‌పల్లి పోలీసుల పట్టుకున్నారు. వీరు రెండేళ్లుగా మల్కాజిగిరి, నాచారం, మేడ్చల్‌, పంజాగుట్ట, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో దందా షురూ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ దంపతులు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.