ఇంట్లో ఈడీ సోదాలు..రెండు ఏకే -47 రైఫిళ్ళ లభ్యం

0
105

అక్రమ కేసులకు సంబంధించి దాడులు చేసి ఈడీకి వింత అనుభవం ఎదురైంది. ఝార్ఖండ్‌లో ఈడీ దాడుల్లో ఏకంగా రెండు ఏకే-47 రైఫిళ్లు బయటపడ్డాయి. కాగా రెండూ భారత జవాన్లకు చెందినవి కావడం గమనార్హం.

ఝార్ఖండ్‌లో జరుగుతున్న అక్రమ మైనింగ్‌కు సంబంధించి హేమంత్ సోరెన్ సన్నిహితుడైన పంకజ్ మిశ్రాను ఇటీవల ఈడీ ప్రశ్నించింది. ఈ క్రమంలో సోదాలు నిర్వహించారు. ఇందులో రెండు రైఫైళ్ళు దొరికాయి.

ఈ సమాచారాన్ని ఈడీ అధికారులు స్థానిక పోలీసులకు అందించారు. ఈ రెండు రైఫిళ్లు వేర్వేరు అల్మరాల్లో దాచి ఉంచారు. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి భారత జవాన్ లవి కాగా ఇక్కడికి ఎలా వచ్చాయి? ఎవరు తెచ్చారు? అనే విషయాలపై దర్యాప్తు చేపట్టారు.