Flash News: ఎక్సైజ్ పోలీసుల మెరుపు దాడి..భారీగా సారాయి పట్టివేత

Excise police raids

0
90

తెలంగాణ: నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం దేవధారికుంటలో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో అధిక మొత్తంలో నల్లబెల్లం, నాటు సారాయి పట్టుకొని బెల్లం పానకం ధ్వంసం చేశారు.

ఇట్టి దాడులలో శాంతి, కవితను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. వీరిద్దరిని తహసీల్దార్ ఎదుట రూ.50,000 వేలకు బైండోవర్ చేయడం జరిగింది. ఈ దాడులలో అచ్చంపేట ఎక్సైజ్ సీఐ అనంతయ్య, ఎస్సై బాల్ రాజ్, అచ్చంపేట సివిల్ ఎస్సై అనుదీప్, ఉప్పునుంతల ఎస్సై రమేష్, ఇద్దరు ట్రైనీ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.