Flash: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఓయూ విద్యార్థి నేతల భేటీ

OU student leaders meet with Revanth Reddy

0
80

రేవంత్ రెడ్డి టీపీసీసీ అయిన తరువాత తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నిత్యం సభలు, సమావేశాలతో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ దూకుడు పెంచారు. ఇటీవల కేసీఆర్ ఇలాకాలో భారీ బహిరంగ సభ నిర్వహించి టీఆర్ఎస్ పార్టీ అవినీతిని ఎండగట్టారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య సీఎంకు కనిపిస్తలేదా అంటూ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. తాజాగా రేవంత్ రెడ్డి నివాసంలో ఓయూ స్టూడెంట్స్ భేటీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. అక్టోబర్ 2 నుండి డిసెంబర్ 9 వరకు నిర్వహించే విద్యార్థి & నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమంపై విద్యార్థి నేతలు చర్చించినట్లు తెలుస్తుంది. అలాగే నియామకాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.