నకిలీ కరెన్సీ నోట్లు ముద్రించి చలామణి చేస్తున్న వ్యక్తిని హైదరాబాదల్ లోని కెపిహెచ్ బి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2000 రూపాయల నకిలీ నోట్లను ముద్రించి మార్కెట్లో చలామణి చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందనేదానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రాజుపై ఇప్పటికే హైదరాబాద్ లోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిసింది. పలుమార్లు రాజును పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ జరిపినట్లు సమాచారం.