Breaking News- సీఎం కేసీఆర్​కు లేఖ రాసి రైతు ఆత్మహత్య..వరి వేయొద్దంటున్నారని ఆవేదనతో..

0
91

తెలంగాణలో మరో రైతు నేలరాలాడు. నేరుగా సీఎం కేసీఆర్ కు లేఖ రాస్తూ బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన మెదక్ జిల్లా హవేలిఘనపూర్ మండలం బొగుడు భూపతిపూర్​లో చోటు చేసుకుంది. ఘటనాస్థలిలో మృతుడు.. ముఖ్యమంత్రి కేసీఆర్​కు రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు.

ఆ లేఖలో రైతు ఏమి రాశాడంటే..’ప్రభుత్వం చెప్పినట్లు సన్నరకం వరి పండిస్తే దిగుబడి తక్కువ వచ్చింది. వచ్చిన పంటకు కనీస మద్దతు ధర లేదు. ఇప్పుడు రబీలో వరి వేయొద్దని చెబుతున్నారు. పుష్కలంగా నీళ్లున్నాయి. నేను కౌలుదారులకు ఏం ఇయ్యాలె. నా తండ్రికి 60 ఏళ్లైనా పింఛను రావడం లేదు. నా కుమారుడు 8 తరగతి చదువుతున్నాడు. తనను ఇంజినీరింగ్ చదివియ్యాలె’ అని సీఎం కేసీఆర్​కు రాసిన లేఖలో రవికుమార్ పేర్కొన్నాడు.