Chennai :కూతురు ఇక లేదన్న వార్త విని ఆగిన తండ్రి గుండె

-

Chennai: తన కూతురుకు విద్యాబుద్ధులు నేర్పించి.. ఉన్నత స్థానంలో చూడాలని అనుకున్న ఆ తండ్రి కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. రోజూ నాన్న అంటూ ఆప్యాయంగా పిలుస్తూ, ఇల్లంతా చలాకీగా తిరిగే ఆ బంగారు తల్లి నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసిన తండ్రికి దుఃఖం ఆగటం లేదు. కూతురు ఇక లేదన్న వార్తను తట్టుకోలేని ఆ తండ్రి గుండె కొట్టుకోవటం ఆగిపోయింది. ఒకే కుటుంబంలో కుమార్తె, తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవటంతో.. ఆ కుటుంబసభ్యులు తల్లడిల్లిపోతున్నారు.

- Advertisement -

తన ప్రేమను నిరాకరించిందని చెన్నైలోని సెయింట్‌ థామస్‌ రైల్వే స్టేషన్‌లో లోకల్‌ ట్రైన్‌ నుంచి సత్య అనే యువతిని సతీష్‌ అనే యువకుడు తోసేశాడు. దీంతో ఘటనా స్థలంలోనే ఆమె ప్రాణాలు వదిలింది. మృతురాలు సత్యప్రియ చెన్నై (Chennai)నగరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో బీకాం చదువుతోంది. మృతురాలి తల్లి పోలీస్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుండగా, తండ్రి ప్రైవేటు కంపెనీలు పని చేస్తున్నారు. కాగా, సతీష్‌తో సత్యప్రియకు పరిచటం ఉంది. ఘటన జరిగే ముందు రైల్వే స్టేషన్‌లో ఇద్దరు తీవ్రంగా ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలోనే తాంబరం నుంచి ఎగ్మోర్‌ వైపు వెళ్తున్న రైలు కిందకు సత్యను తోసేశాడు. అనంతరం సతీష్‌ అక్కడ నుంచి పరారయ్యాడు. ఘటనపై ఆ రాష్ట్ర(Chennai) సీఎం స్టాలిన్‌ సీరియస్‌ అయ్యారు. నిందితుడిని త్వరగా అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిందితుడు కోసం పోలీసులు ఏడు బృందాలుగా ఏర్పడి.. ఎట్టకేలకు అరెస్టు చేశారు.

ఇదిలా ఉండగా, సత్యప్రియ మృతదేహాన్ని చూసిన ఆమె తండ్రి తట్టుకోలకపోయాడు. దీంతో గుండెపోటుతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...